ట్విట్టర్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పండగ పర్వదినాలను పురస్కరించుకుని పలు ప్రచార చిత్రాలను చిత్రబృందం విడుదల చేసింది. అయితే ఈ సినిమా టీజర్‌, స్పెషల్‌ వీడియోల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌ రావిపూడి శనివారం ఉదయం టీజర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. అందులో మహేశ్‌ గన్‌ ట్రిగ్గింగ్‌ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘టీజర్‌ లోడింగ్‌’ అని అనిల్‌ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే అతి త్వరలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను పంచుకున్న అతి తక్కువ సమయం నుంచే అది సోషల్‌మీడియాలో దూకుసుపోతుంది. #SarileruNeekevvaruTeaser అనే హ్యాష్‌ట్యాగ్‌ వరల్డ్‌ వైడ్‌ ట్రెండింగ్‌ అవుతోంది. మరోవైపు హైదరాబాద్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో 1, 3, 4, స్థానాలు మహేష్‌కు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లతో ఉన్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సర్‌ప్రైజ్‌ కోసం సూపర్‌స్టార్‌ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ చూస్తే అర్థమవుతోంది.