చిరు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది!

ఓ పక్క సీనియర్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ.. మరో పక్క యంగ్ హీరోలతో ప్రత్యేక గీతాల్లో నటిస్తోన్న భామ శ్రియ. ఎంతమంది హీరోయిన్లు ఇండస్ట్రికు వస్తున్నా శ్రియ మాత్రం ఇప్పటికీ అవకాశాలు సంపాదిస్తూ దూసుకుపోతుంది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటించిన శ్రియ బాలయ్య 101వ సినిమాలో కూడా ఛాన్స్ సంపాదించుంది. ఈ క్రమంలో మెగాస్టార్ సినిమాలో కూడా అవకాశం కోసం అమ్మడు గట్టిగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు.

చిరంజీవి 151వ చిత్రంగా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మలను తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ దక్షిణాది సినిమాలో వారు నటిస్తారా..? అనేది సందేహం. దీంతో కథానాయిక పాత్ర కోసం శ్రియ తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చారిత్రక నేపధ్యం కలిగిన సినిమాల్లో నటించిన అనుభవం ఉంది గనుక ఆ అవకాశం తనను ఖచ్చితంగా వరిస్తుందని సన్నిహితుల వద్ద చెబుతోందట.