HomeTelugu Trendingవరుస సినిమాలతో బిజీగా సత్యదేవ్

వరుస సినిమాలతో బిజీగా సత్యదేవ్

Satyadev in Full Josh with
టాలీవుడ్ మోస్ట్‌ టాలెంటెడ్ ఆర్టిస్టులలో సత్యదేవ్ ఒకరు. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వచ్చి తన టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది సినిమాల్లో గుర్తుపట్టలేనంత సేపు పాత్రలు చేశాడు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన జ్యోతిలక్ష్మి గుర్తింపు తెచ్చింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తున్నాడు.

సత్యదేవ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో పలు హిందీ సినిమాల్లోనూ నటించిన సత్యదేవ్ ఇప్పుడు అక్షయ్ కుమార్ మూవీ రామ్‌సేతులో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని తెలిపాడు సత్యదేవ్. ప్రస్తుతం సత్యదేవ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తిమ్మరుసు, గాడ్సే, గుర్తుందా శీతాకాలం అనే సినిమాలు చేస్తున్నాడు. కొత్తదర్శకుడు వీవీ గోపాలకృష్ణతో మరో సినిమాకు సైన్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu