HomeTelugu Trendingఆసక్తికరంగా 'సావిత్రి W/O సత్యమూర్తి' టీజర్‌

ఆసక్తికరంగా ‘సావిత్రి W/O సత్యమూర్తి’ టీజర్‌

Untitled 1 1
ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మి, ‘కేరింత’ ఫేమ్‌ పార్వతీశం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సావిత్రి w/o సత్యమూర్తి’. దర్శకుడు చైతన్య కొండ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు మలినేని గోపీచంద్‌ బుధవారం విడుదల చేశారు. ‘బ్రేకింగ్‌ న్యూస్‌.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చిన సత్య’ అనే సంభాషణతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం నవ్వులు పంచుతోంది. భార్యాభర్తలుగా శ్రీ లక్ష్మి, పార్వతీశం నటన ఆకట్టుకుంటుంది. వయసు కనిపించకుండా ఉండేందుకు సత్యమూర్తి (పార్వతీశం) ఏం చేశాడు? అని పోలీసులూ ఆరా తీస్తుంటారు. ఈ క్రమంలో ఎంతో కామెడీ పండించారు. మరి సత్యమూర్తికి 60 సంవత్సరాల వయసు ఉన్నా 25 ఏళ్ల కుర్రాడిగా ఎలా కనిపిస్తున్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మహేంద్ర క్రియేషన్స్‌ పతాకంపై గోగుల నరేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu