HomeTelugu Trendingవినాయకచవితి సందర్భంగా 'సీటీమార్‌'

వినాయకచవితి సందర్భంగా ‘సీటీమార్‌’

seetimaarr release on septe

టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌- సంపత్‌ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా వేసవి లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. గోపీచంద్‌ నుంచి కోరుకునే మాస్అంశాలతో పాటు, భావోద్వేగాలను కూడా జోడించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నరు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశి, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu