పవర్‌ స్టార్‌పై రాశి ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో మెగాస్టార్ తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విజయం తరువాత వరసగా సినిమాలు చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పవన్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. అందులో ఒకటి గోకులంలో సీత. ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది.

గోకులంలో సీత సినిమాలో ‘రాశి’ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా తరువాత మరలా రాశితో కలిసి సినిమా చేయలేదు. బద్రి సినిమా తరువాత పవన్ స్టయిల్ మారిపోయింది. సొంతంగా ఫ్యాన్స్ ఏర్పడారు. టాలీవుడ్ లో టాప్ హీరోగా మారిపోయారు. నాలుగేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు రాశి షూటింగ్ దగ్గరకు వెళ్లిందట. తన బాబు బర్త్ డే పిలిచేందుకు వెళ్లగా, పవన్ కళ్యాణ్ క్యారీ వ్యాన్ లో ఉన్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ ను ఇప్పుడు కలవడం కుదరదని, అయినా ఒకసారి మీరు వచ్చారని చెప్తానని చెప్పి డ్రైవర్ పవన్ దగ్గరకు వెళ్లి చెప్పగా, వెంటనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి తనను లోపలికి తీసుకెళ్లారని రాశి ఇటీవలే ఓ మీడియాలో పేర్కొన్నది.