‘లంక’లో రాశి!

సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘లంక’. శ్రీముని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నామన శంకర్రావు-సుందరిలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను సంచలన దర్శకులు మారుతి విడుదల చేశారు చేశారు. 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ”వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రాశీ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలవడం ఖాయం. స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా పర్టీక్యూలర్ గా ఉండే రాశీ గారు మా దర్శకుడు శ్రీముని చెప్పిన కథ నచ్చి ఈ చిత్రంలో నటించడం మాకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. షూటింగ్ పూర్తయ్యింది ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘లంక’ ఆడియోను ఈనెలాఖరుకు విడుదల చేసి వచ్చే నెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.