అల్లు అర్జున్‌కి ట్రైనింగ్‌ ఇచ్చా: బిత్తిరి సత్తి

తీన్మార్ ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెర అభిమానులను అలరించి ప్రస్తుతం తుఫాకి రాముడిగా వెండితెరపై వెలుగు వెలుగుతున్న బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్, ఇప్పుడిప్పుడే తన గత జీవితంలో జరిగిన సంఘటనలను బయటపెడుతున్నాడు. బిత్తిరి సత్తి పాత్ర ద్వారా తనకు వచ్చిన ఫేమ్‌తో డబ్బు సంపాదించుకోవడం తప్పుకాదని రవి కుమార్ కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిత్తిరి సత్తి తాను సినిమా ఇండస్ట్రీలో పడిన కష్టాలను పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అలాగే తన వద్ద స్టైలిష్ అల్లు అర్జున్ ఓ విషయంలో ట్రైనింగ్ తీసుకున్నట్లు బాంబు పేల్చాడు. రుద్రమ దేవీ సినిమాలో గోనగన్నారెడ్డి పాత్ర వేసిన అల్లు అర్జున్‌కు తెలంగాణ యాస నేర్చుకోవడం తప్పనిసరి అయ్యింది. దీంతో ఆ యాసలో పట్టుకోసం తనను అల్లు అర్జున్ ఫోన్ చేసి మరీ సంప్రదించినట్లు సత్తి చెప్పుకొచ్చాడు. అలాగే అల్లు అర్జున్ చాలా మంచి వ్యక్తి అని తన స్టార్ డమ్ నిలబెట్టుకోవడం కోసం అతడు పడే శ్రమ మామూలు విషయం కాదని అన్నాడు.