
Shah Rukh Khan’s King Shocking Cast:
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మళ్ళీ ఒక భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సినిమా పేరు “కింగ్”. ఈ సినిమాకు “పఠాన్” ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. అందులోకి, షారుఖ్ సరసన రాణి ముఖర్జీ కూడా నటిస్తుండడం ఫ్యాన్స్‌కి నిజంగా గుడ్ న్యూస్!
రాణి ముఖర్జీ-షారుఖ్ కలయిక అంటే చాలామందికి గుర్తొచ్చే సినిమాలు “కుచ్ కుచ్ హోతా హై”, “కభీ అల్విదా నా కెహ్నా”. ఇప్పుడు వాళ్ళు మళ్లీ కలిసి నటించబోతున్నారు. ఇందులో రాణి, సుహానా ఖాన్‌కి తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్ర చిన్నదే కానీ, సినిమా కథకు చాలా కీలకం.
సినిమాలో రాణి షూటింగ్ టైం కేవలం ఐదు రోజులు మాత్రమే. కానీ ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని ఎమోషన్‌తో నింపేలా ఉంటుంది అంటున్నారు. ఈ పాత్ర విన్న వెంటనే రాణి వెంటనే అంగీకరించారట!
View this post on Instagram
ఇదే కాదు, “కింగ్” సినిమాలో 10 మంది ప్రముఖ నటులు కూడా ఉన్నారు:
*షారుఖ్ ఖాన్
*రాణి ముఖర్జీ
*దీపికా పడుకోన్
*సుహానా ఖాన్
*అభిషేక్ బచ్చన్
*అనిల్ కపూర్
*జాకీ ష్రాఫ్
*జైదీప్ అహ్లావత్
*అర్షద్ వార్సీ
*అభయ్ వర్మ
ఈ సినిమా షూటింగ్ మే 20 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత యూరప్‌లో కూడా కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. సినిమా 2026 అక్టోబర్ – డిసెంబర్ మధ్య థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.
షారుఖ్ మరియు రాణి మళ్లీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారంటే అభిమానులకు ఇది పెద్ద ట్రీట్ లాంటిది. ఇక దీపికా, అనిల్ కపూర్, అభిషేక్ లాంటి స్టార్స్ కూడా ఉండటంతో ఈ సినిమా మీద బజ్ మామూలుగా లేదు!
ALSO READ: Hari Hara Veera Mallu ట్రైలర్ తెలుగు సినీ చరిత్రలో మొదటి అద్భుతం!