HomeTelugu TrendingShahid Kapoor: మళ్లీ తెలుగు దర్శకుడితో సినిమా..ఈసారి హిట్ పడేనా!

Shahid Kapoor: మళ్లీ తెలుగు దర్శకుడితో సినిమా..ఈసారి హిట్ పడేనా!

Shahid Kapoor

Shahid Kapoor: బాలీవుడ్‌ హీరో షాహిద్ కపూర్ ఇప్పటికే తెలుగు దర్శకులతో పలు సినిమాలు చేశాడు. సందీప్ రెడ్డి వంగాతో ‘కబీర్ సింగ్’, గౌతమ్ తిన్ననూరితో ‘జెర్సీ’ చేశాడు. ఈ రెండు సినిమాలు తెలుగు రీమేక్‌లే కావడం విశేషం. వాటిలో ‘కబీర్ సింగ్’ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

‘జెర్సీ’ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇంకో విశేషమేంటంటే.. ‘జెర్సీ’ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. తాజాగా మరో తెలుగు దర్శకుడితో… షాహిద్‌ కపూర్‌ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో చేయనున్నారని సమాచారం.

ఇప్పటికే వంశీ వినిపించిన కథ నచ్చి, సినిమా చేయడానికి షాహిద్ అంగీకరించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని అంటున్నారు. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి.. దిల్ రాజు బ్యానర్ ఇప్పటికే పలు సినిమాలు చేశాడు. షాహిద్ కపూర్‌కి కూడా దిల్‌ రాజ్‌తో ఓ సినిమా చేసిన పరిచయం ఉంది. దీంతో మరో ప్రాజెక్టు పట్టాలు ఎక్కిస్తున్నారని చెప్తున్నారు.

Shahid Kapoor 1 Shahid Kapoor,Vamshi Paidipally,Kabir Singh,Jersey,Dil Raju

అయితే తెలుగు సినిమా రీమేక్ అని వినిపిస్తోంది. అయితే ఏ రీమేక్ అనేది తెలియాల్సి ఉంది. కాగా దర్శకుడు వంశీ పైడిపల్లి చివరిగా తెరకెక్కించిన చిత్రం ‘వారసుడు’. ఈ సినిమా వచ్చి ఏడాది దాటిపోయినా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. ఏ హీరో కూడా వంశీ పైడిపల్లితో సినిమా చేయటానికి పెద్దగా ఉత్సాహం చూపించలేదు. గత ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వారసుడు మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించక బోల్తాపడింది. హిట్ అని ఎంత లేపుదామని ప్రయత్నించినా ఫలితం లేదు. టీవి సీరియల్ లా ఉందంటూ కామెంట్స్ రావటం దెబ్బ తీసింది. తమిళం, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు దాదాపు ఒకే రకమైన ఫలితం వచ్చింది. వారసుడు మూవీ రిలీజ్ విషయంలో దిల్ రాజు లెక్క తప్పింది.

తెలుగులో ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకు మరో విధంగా మైనస్ అయిందని కామెంట్లు వినిపించాయి. కాగా దిల్ రాజు ఈ సినిమా తమిళ హక్కులు ముందుగానే అమ్మేయడంతో ఈ సినిమాకు నష్టాలు వచ్చినా దిల్ రాజుపై ఆ భారం పెద్దగా లేదని సమాచారం. అప్పట్లో.. తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఉండటం వారసుడు సినిమాకు మైనస్ అయింది.

అవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమాతో.. దర్శకుడుగా వంశీ పైడిపల్లికి ఎన్నడూ రానంత బ్యాడ్ నేమ్ ఈ సినిమాతో వచ్చింది. ఈ క్రమంలో వంశీ దృష్టి బాలీవుడ్ పై పెట్టినట్లు తెలుస్తోంది. వంశీ ఈ సినిమాతో అయిన ట్రేక్‌లోకి వస్తాడా.. షాహిద్‌ కపూర్‌కు ఈ సారి కూడా హిట్ పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!