ఫ్యామిలీ డైరెక్టర్ తో శర్వానంద్!

ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోల్లో క్రేజ్ ఉన్న హీరో శర్వానంద్. ప్రతి సినిమాను ఎంతో ప్లాన్డ్ గా చేసుకుంటూ వస్తున్నాడు ఈ యువ హీరో. రీసెంట్ గా ‘శతమానం భవతి’తో హిట్ కొట్టిన శర్వా ప్రస్తుతం తను నటించిన ‘రాధ’ సినిమా రిలీజ్ కు ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రేమతో పాటు యాక్షన్ కూడా సమపాళ్లలో ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ‘శతమానం భవతి’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్న శర్వా ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలతో ఆకట్టుకునే దశరధ్ తో ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
దశరధ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ను సిద్ధం చేసుకొని శర్వానంద్ కు వినిపించడం దానికి శర్వా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా తరువాత దశరధ్ ఆ రేంజ్ హిట్ సినిమా అందుకోలేకపోయారు. కొన్ని ప్రయోగాలు చేసి ఫ్లాప్ రుచిని చవి చూశారు. దీంతో మరోసారి తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ సబ్జెక్ట్ ను ఎన్నుకున్నారు. ఈ చిత్రానికి ‘ఋతురాగాలు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా.. దశరధ్ సక్సెస్ బాట పడతారేమో చూడాలి!