‘2.0’ క్రేజ్ కు ఇదే నిదర్శనం!

ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 450 కోట్ల హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా 2 .0. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టి ఐ మిగిల్చిన చేదు అనుభవం నుండి బయటపడాలని చూస్తున్న శంకర్ చాలా కసిగా స్క్రిప్ట్ మీద వర్క్ చేసాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా గ్రాఫికల్ వర్క్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని దించాడు. ఇక రిలీజ్ విషయంలో అస్సలు తొందర పడకుండా చాలా టైం చేతిలో ఉంచుకుని ప్రమోషన్స్ సహా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండడంతో 2.0 కి నేషనల్ లెవెల్ లో బజ్ క్రియేట్ అయింది. ఇక రజిని కి ఎటూ చాలా దేశాల్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది.మొన్నటివరకు జపాన్ తో పాటు కొని దేశాల్లో మాత్రమే రజిని సినిమాకి ఫుల్ డిమాండ్ ఉంటె కబాలి నుండి మరికొన్ని దేశాల్లో కూడా రజిని సినిమా కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
 
రోబో సీక్వెల్ కాబట్టి సినిమాకి ఇంత ఆదరణ ఉంది అనుకోవచ్చు.కానీ ఈ నెల 27 న దుబాయ్ లో జరగబోతున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ ఆడియో ఈవెంట్ కి ఉన్న డిమాండ్ చూస్తే మాత్రం తలైవా ఫాలోయింగ్ అర్ధమవుతుంది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పార్క్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కి టికెట్ ధర 60 వేలుగా నిర్ణయించినా గాని విపరీతమయిన బుకింగ్స్ జరుగుతున్నాయట.
 
ఆల్రెడీ 90 % టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడయిపోయాయి. ఈ డిమాండ్ చూసి యూనిట్ అంతా చాలా ఉత్సాహంగా ఉందని టాక్. సినిమాకి కూడా ఇదే రేంజ్ లో క్రేజ్ వస్తే ఇంత భారీ ప్రాజెక్ట్ సైత సేఫ్ వెంచర్ గా రిలీజ్ అవుతుంది. ఇక హిట్ టాక్ దక్కితే సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ కూడా చాలా ఈజీగా దాటేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఆడియో లాంచ్ కూడా ప్రొడ్యూసర్స్ కి మంచి ప్రాఫిటబుల్ ఈవెంట్ గా మారేలా ఉంది.