HomeTelugu Trendingబిగ్‌బాస్‌: యాంకర్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ

బిగ్‌బాస్‌: యాంకర్‌ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ

5తెలుగు బిగ్‌బాస్‌ ఆరు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇందులో ఐదు ఎలిమినేషన్లు, ఒక్క వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి. అయితే వైల్డ్‌కార్డ్‌ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. మరుసటి వారంలో వెనుదిరిగి పోయింది. అలా స్పెషల్‌ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్‌.. అనూహ్యంగా ఎలిమినేట్‌ కావడంతో మరో వ్యక్తిని హౌస్‌లోకి పంపుతారని అంతా భావించారు. దీనికి తగ్గట్లే గత వారంలో ఓ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉంటుందని వార్తలు ప్రచారం అయ్యాయి.

శ్రద్దా దాస్‌, ఈషా రెబ్బా లాంటి హీరోయిన్ల పేర్లు ఆ జాబితాలో వినిపించాయి. తీరా చూస్తే.. అవన్నీ వట్టి పుకార్లుగానే ఉండిపోయాయి. అయితే ఆరో వారంలో రమ్యకృష్ణ హోస్టింగ్‌.. నో ఎలిమినేషన్‌.. ఇలా పలు సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకప్పటి యాంకర్‌ శిల్పా చక్రవర్తి.. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె హౌస్‌లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

5a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!