షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్.. సమంత ‘సూప‌ర్ డీల‌క్స్’ A స‌ర్టిఫికేట్

అక్కినేని స‌మంత న‌టించిన సూప‌ర్ డీల‌క్స్ సినిమాకు A స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో హీరో. త్యాగ‌రాజ కుమార్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్త‌యింది. దీనికి A స‌ర్టిఫికేట్ ఇచ్చి షాక్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ట్రైల‌ర్ చూసుండ‌రు అంటూ ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవ‌డంతో చిత్ర విజ‌యంపై న‌మ్మ‌కంగా ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ట్రైల‌ర్ చూసిన‌పుడే క‌చ్చితంగా ఇది కొత్త‌గా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మైపోయింది. అయితే A స‌ర్టిఫికేట్ మాత్రం ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇందులో విజ‌య్ సేతుప‌తి అమ్మాయిగా న‌టిస్తున్నాడు. స‌మంత అక్కినేని హీరోయిన్. ఈమె పాత్ర కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. ట్రైల‌ర్లో క‌త్తి ప‌ట్టుకుని ఎవ‌ర్నో న‌రుకుతున్న‌ట్లు చూపించాడు ద‌ర్శ‌కుడు త్యాగ‌రాజ‌న్. ఇక ఫ‌హాద్ ఫాజిల్, ర‌మ్య‌కృష్ణ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో పోర్న్ స్టార్ పాత్ర‌లో న‌టిస్తుంది.

సూప‌ర్ డీల‌క్స్ ట్రైల‌ర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. రెండు నిమిషాల ట్రైల‌ర్లో క‌థ‌ ఏ మాత్రం అర్థం కాకుండా క‌ట్ చేసాడు ద‌ర్శ‌కుడు. మార్చ్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. స‌మంత‌, ర‌మ్య‌కృష్ణ లాంటి స్టార్స్ ఉన్నారు కాబ‌ట్టి తెలుగులో కూడా ఈ చిత్రం విడుద‌ల కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ సూప‌ర్ డీల‌క్స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో..?