HomeTelugu Big Storiesవేశ్యగా బన్నీ హీరోయిన్‌.. ఇదీ క‌ల్మ‌షం లేని హ‌ృదయం అంటోంది

వేశ్యగా బన్నీ హీరోయిన్‌.. ఇదీ క‌ల్మ‌షం లేని హ‌ృదయం అంటోంది

10 18టాలీవుడ్‌లో అల్లు అర్జున్ సరసన ‘ఆర్య-2’ లో నటించిన శ్రద్దాదాస్.. ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు ధ‌రించి యూత్‌ని ఆక‌ట్టుకున్న విషయం తెలిసిందే. ఆమె చాలా గ్యాప్ త‌రువాత ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. ఒక వేశ్య మనో భావాన్ని క‌ల్మ‌షం లేని హ‌ృదయాన్ని క‌ళాత్మ‌క దృష్టి తో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్‌.. స్టార్‌డ‌మ్ వున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలు చేస్తే స‌మాజానికి ఎంతో కొంత మేలు జ‌రుగుతుందనే చెప్పాలి. బాలీవుడ్ లో ఇలాంటి మెసెజ్ ఓరియంటెడ్ ల‌ఘు చిత్రాల్లో చాలా మంది స్టార్స్ న‌టించ‌టం మ‌న‌కు తెలుసు.. టాలీవుడ్‌లో కూడా ఇలా స్టార్స్ న‌టించిన సంద‌ర్బాలు వున్నాయి.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐయామ్ ద‌ట్ ఛేంజ్ అనే షార్ట్ ఫిల్మ్ అంద‌ర్ని ఆక‌ట్టుకుంది.. అలానే సుప్రీమ్ హీరో సాయిధ‌రమ్ తేజ్ క‌మెడియ‌న్ వైవా హ‌ర్షా తో క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ , నేను మీ క‌ళ్యాణ్ లాంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.. అలాగే హీరోయిన్స్ రెజీనా కూడా మంచి సందేశాత్మ‌క షార్ట్ ఫిల్మ్‌లో న‌టించారు. ఇప్ప‌డు అదే త‌ర‌హ‌లో చాలా బోల్డ్ పాత్ర‌లో శ్ర‌ద్ధాదాస్ న‌టించ‌డం విశేషం.

క‌థ విష‌యానికోస్తే వ‌ర్ణ ప్రేమ లో విఫ‌ల‌మైన ఒక మంచి పెయింట‌ర్‌.. త‌న ప్యారిస్ ఎగ్జిబిష‌న్ లో 100 వ పెయింటింగ్ కోసం ఒక వేశ్య‌( శ్వేత) ని ఎంచుకుంటాడు.. త‌ను ప్రేమించిన అమ్మాయి త‌న మెద‌టి పెయింటింగ్ గా మెద‌లు పెట్టిన వ‌ర్థ త‌న నూర‌వ పెయింటింగ్ ని శ్వేతని ఎంచుకుంటాడు.. అయితే పెయింటింగ్ వేస్తున్న స‌మ‌యంలో వీరిద్ద‌రి మధ్య జ‌రిగిన సంభాష‌ణ లో శ్వేతలో ఒక ప్యూర్ సోల్ ని చూస్తాడు వ‌ర్ణ‌.. అదే స‌మ‌యం లో స‌మాజం లో నిజాయితిని వ‌ర్ణ లో చూస్తుంది శ్వేత‌.. త‌ను ప్రేమించిన అమ్మాయి లో అబ‌ద్దాన్ని చూసిన వ‌ర్ణకి శ్వేతలో ప్యూరిటి ఆఫ్ వుమెన్ క‌నిపించింది. వీరిద్ద‌రి మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌లో వ‌ర్ణ పెయింటింగ్ వేస్తాడు.. అస‌లు ఆ పెయింటింగ్ ఎంటి అనేది ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu