శ్రియ, బాలయ్యల దాగుడుమూతలు!

హీరోయిన్ శ్రియ ప్రస్తుతం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో
నటిస్తోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్ లో ఓ సరదా దృశ్యంను శ్రియ
తన అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం నృత్యదర్శకురాలు బృందా కంపోజిషన్ లో
ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే పాట మధ్యలో విరామంలో సరదాగా తీసుకున్న ఓ
ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.  ఈ ఫోటోలో శ్రియ, బాలయ్యలు ఎవరితోనో
దాగుడుమూతలు ఆడుతున్నారు. ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నట్లుగా శ్రియ, బాలయ్యలు
ఓ వ్యక్తి వైపు చూపిస్తున్నారు. కళ్లుమూసుకొని ఉన్న ఈ వ్యక్తి ఎవరని అనుకుంటున్నారా..?
ఇంకెవరండీ చిత్ర దర్శకుడు క్రిష్. గడ్డం బాగా పెంచి, టోపీ పెట్టుకున్న క్రిష్ ను గుర్తుపట్టలేని
విధంగా ఉన్నాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో సినిమాను
నిలబెట్టాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.