HomeTelugu Trendingశ్రియ భర్తకు కరోనా లక్షణాలు

శ్రియ భర్తకు కరోనా లక్షణాలు

7 13
కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలలో స్పెయిన్ ఒకటి. దీంతో అక్కడ బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయని అంటుంది హీరోయిన్ శ్రియ శరన్. ఈ జంట గత కొంత కాలంగా స్పెయిన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త అందరూకి పొడి దగ్గు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని అంటుంది. బార్సిలోనాలోని ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు బయపడి తమని ఇంటికి పంపించినట్లు చెప్పారు. ఈ విషయంపై శ్రియ మాట్లాడుతూ.. ‘ఆండ్రీకి పొడి దగ్గు, జ్వరం రావడం ప్రారంభమైంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే బార్సినాలోని ఆసుపత్రికి వెళ్లాము. కానీ అక్కడి వైద్యులు భయపడి మమ్మల్ని ఆసుపత్రి నుంచి వెళ్ళమని కోరారు’ అని చెప్పారు. అయితే వారు మాత్రం ఇద్దరినీ ఇంట్లోనే ఉండమని.. సెల్ఫ్ ఐసోలేషన్ పాటించమని తిప్పి పంపారట. ప్రస్తుతం ఆండ్రీ బాగానే ఉన్నాడని కూడా వెల్లడించింది. మేమిద్దరం వేర్వేరు గదుల్లో ఉంటూ భౌతిక దూరం కూడా పాటిస్తున్నాము. అని శ్రియ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!