గ్లామరస్ రోల్స్ చేయను: శ్రియా శర్మ

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రియా శర్మ హీరో హీరోయిన్లుగా హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిలిం ప్రొడక్షన్‌ బ్యానర్స్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మలకాన్వెంట్‌’ కింగ్‌ నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రియా శర్మ విలేకర్లతో ముచ్చటించారు.
మీ నేపథ్యం…?
మాది హిమాచల్‌ ప్రదేశ్‌. నాన్నగారు ఇంజనీర్‌, అమ్మ డైటిషియన్‌. ప్రస్తుతం నేను ఎల్.ఎల్.బి సెకండ్ ఇయర్ చదువుతున్నా.. చిన్నప్పట్నుంచి పలు యాడ్స్‌, సీరియల్స్‌లో నటించడంతో నటన అంటే ఆసక్తి పెరిగింది.
ఈ సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక ఫ్రెష్‌, ప్యూర్‌ అండ్‌ ఇన్‌స్పైరింగ్‌ లవ్‌స్టోరీ. ఈ చిత్రంలో శాంతి అనే అమ్మాయి పాత్రలో కనపడతాను. చాలా కోపం. అసూయ ఉండే అమ్మాయే శాంతి. ఈ సినిమా చూసేటప్పుడు టీనేజ్ అమ్మాయిలు నా పాత్రతో బాగా కనెక్ట్‌ అవుతారు.
నాగార్జున గారితో కలిసి నటించడం ఎలా అనిపించింది..?
నేను గాయకుడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాను. అంత కంటే ముందు చిరంజీవిగారు, రజీనీకాంత్‌, షారూక్‌ఖాన్‌ వంటి సూపర్‌స్టార్స్‌తో యాక్ట్‌ చేశాను. ఇక నిర్మలాకాన్వెంట్‌ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో నాగార్జునగారితో నాకు కాంబినేషన్ సీన్స్ లేవు కానీ కొత్త కొత్త భాష.. సాంగ్‌లో ఆయనతో కలిసి యాక్ట్‌ చేశాను. అంత పెద్ద నటుడితో యాక్ట్‌ చేయడం హ్యాపీగా అనిపించింది. చాలా కొత్త విష‌యాలు నేర్చుకున్నాను.
డైరెక్టర్ సినిమాను ఎలా డీల్ చేశారు..?
డైరెక్టర్‌ జి.నాగకోటేశ్వరరావుగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి సీన్‌ను చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఆయనే కారణం. ప్రతి విషయంలో ఎంతో కేర్‌ తీసుకోవడమే కాకుండా మంచి అవుట్‌పుట్‌ రావడానికి ఎంతగానో శ్రమించారు. అలానే హీరో రోషన్‌కు ఇదే తొలి సినిమా, అయినా తను చాలా కాన్ఫిడెంట్‌గా యాక్ట్‌ చేశాడు. సీన్స్‌ ఎలా చేయాలనేది ఇద్దరం డిస్కస్‌ చేసి చేశాం.
మ్యూజిక్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయినట్లుంది..? మీ ఫెవరెట్ సాంగ్ ఏంటి..?
రోషన్ సాలూరి ట్యూన్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అందించారు. ఈ ఆల్బమ్‌లో ముద్దు సాంగ్‌ నాకు బాగా ఇష్టమైన సాంగ్‌. ఆ సాంగ్‌లో లిరిక్స్‌ కానీ, పిక్చరైజేషన్‌ కానీ చాలా బావుంటాయి.
ఎలాంటి పాత్రల్లో నటించాలనుకుంటున్నారు..?
గ్లామరస్ రోల్స్ లో నటించను. వాటి కంటే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించడానికి ఇష్టపడతాను.
డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా..?
పలానా అని చెప్పను కానీ పాత్ర నచ్చితే చాలు. ఏ సినిమాలో అయినా నటిస్తాను.
తెలుగులో మీ ఫెవరెట్ హీరోయిన్..?
అసిన్ గారంటే చాలా ఇష్టం. ఆమె నటనను స్ఫూర్తిగా తీసుకుంటాను.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
కన్నడలో ఓ సినిమా చేస్తున్నాను. అలానే హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో నటించమని ఆఫర్స్ వస్తున్నాయి. డిస్కషన్స్ జరుగుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates