వరద బాధితులకు హీరో రామ్, సంపూ విరాళం

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు(కేసీఆర్) భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపున్చిన సంగతి తెలిసిందే. దీనిపై చాలా మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు విరాళం ప్రకటిస్తున్నారు. కోట్ల రూపాయల విరాళం ప్రకటించి పెద్దమనసు చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా వరద భాదితుల సహాయార్థం టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ పోతినేని తన వంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందజేశారు. ఈ మేరకు రామ్‌ హైదరాబాద్‌లోని మంత్రి కేటీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి రూ.25 లక్షల చెక్ ను కేటీఆర్ కు అందజేశారు. ఆయ‌న మంచి మ‌న‌సుపై నెటిజ‌న్స్ ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. కాగా సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుకు చెక్కును అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates