చిరుతో శృతిహాసన్ సెట్ అవుతుందా..?

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పుడు తదుపరి చిత్రంపై దృష్టి పెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులను ముమ్మరం చేశారు. ముందుగా ఈ సినిమా హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అనుష్క అయితే పెర్ఫెక్ట్ అని అందరూ భావిస్తున్నారు. నిజానికి ఖైదీ సినిమాలో కూడా అనుష్కనే చేయాల్సింది కానీ డేట్స్ సర్ధుబాటు కాక చేయలేకపోయింది.

దీంతో ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా అయినా అనుష్కతో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి మాత్రం శృతిహాసన్ ను తీసుకోవాలని పట్టుబడుతున్నాడట. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో శృతిహాసన్ ‘రేసుగుర్రం’ సినిమాలో నటించింది. ఆ సెంటిమెంట్ తోనే చిరు సినిమాలో శృతిని తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. మరి చిరు పక్కన శృతిహాసన్ ఎలా ఉంటుందనేదే ప్రశ్న. శృతి ఇంకా యంగ్ అమ్మాయిలానే కనిపిస్తుంది గనుక చిరు పక్క ఆమె జంటగా కనిపిస్తే అదోరకంగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఎవరిని తీసుకుంటారో.. చూడాలి!