HomeTelugu Trendingవేశ్య పాత్రలో శ్వేతాబసు

వేశ్య పాత్రలో శ్వేతాబసు

Shweta Basu Prasad visits M
కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది శ్వేతాబసు. ఆ తర్వాత సెక్స్ రాకెట్‌లో ఇరుక్కోవడంతో కెరీర్‌లో వెనకబడింది. దీంతో టాలీవుడ్‌ వదిలి బాలీవుడ్‌కు మకాం మార్చింది శ్వేతాబసు. బాలీవుడ్‌ దర్శకుడిని వివాహం చేసుకున్నా ఏడాదిలోనే విడాకులు తీసుకుంది. వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంది. కెరీర్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో వేశ్య పాత్రను పోషిస్తోంది. గతంలో ఎందరో హీరోయిన్లు వేశ్య పాత్రలో నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే. సెక్స్ వర్కర్లు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా కోసం ముంబైలోని రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లి వాళ్ల సమస్యలను స్వయంగా పరిశీలించిందట శ్వేతాబసు. లాక్‌డౌన్‌లో అనేక రంగాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ముంబైలోని రెడ్‌లైట్ ఏరియా సెక్స్ వర్కర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో స్వయంగా పరిశీలించేందుకు దర్శకుడితో పాటు శ్వేతాబసు, చిత్ర యూనిట్ ఆ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వాళ్లు మాట్లాడే యాసను, నేను సినిమాలో ఎలా నటించాలో నేర్చుకున్నా, వారి ఆలోచనా విధానం ఎలా వుంటుంది, వారి జీవితాలు ఏమిటనేది తెలుసుకున్నాను అంటోంది శ్వేతాబసు. అక్కడకు వెళ్లటం లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ అంటోంది. అక్కడ సెక్స్ పర్కర్ మెహ్రునిస్సాను కలిసినట్లు తెలిపింది. తన పాత్రను మెహ్రునిస్సాకు అంకితమిస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని మధుర్ బండార్ తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!