బిగ్‌బాస్‌-3 లో ఇద్దరు హాట్‌ యాంకర్లు

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో సైతం మంచి ఆదరణను దక్కించుకుంది. దీంతో షో నిర్వాహకులు ఈసారి షోలో పాల్గొనబోయే అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులకి బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీలనే షోలోకి తీసుకుంటున్నారు. తాజా సమాచారం మేరకు బుల్లితెర మీద పాపులర్ అయిన ఇద్దరు లేడీ యాంకర్లను షోలోకి తీసుకుంటున్నారట. వాళ్ళే శ్రీముఖి, లాస్య. పలు టీవీ షోలతో ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ షోకు స్టార్ హీరో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించి ఓ ప్రోమోను కూడా విడుదలచేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది