HomeTelugu Trending'చంద్రముఖి'గా సిమ్రాన్‌.?

‘చంద్రముఖి’గా సిమ్రాన్‌.?

3 2
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘చంద్రముఖి’ సినిమా అప్పట్లో సూపర్‌ హిటైన సంగతి తెలిసిందే. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హారర్ చిత్రాలలో కొత్తతరహా చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో ‘చంద్రముఖి’ పాత్రలో జ్యోతిక నటించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రానికి దర్శకుడు వాసు సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో రజనీకాంత్ పాత్రను లారెన్స్ పోషిస్తున్నాడు. చంద్రముఖిగా ఒకప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ నటిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది.

అయితే, తాజాగా దీనిపై సిమ్రాన్ స్పందించింది. ఈ వార్త పూర్తిగా అవాస్తవమని చెప్పింది. ‘అభిమానులను నిరాశకు గురి చేస్తున్నందుకు క్షమించండి.. ఇందులో నేను నటించడం లేదు. అసలు ఈ పాత్ర చేయమంటూ ఇంతవరకూ నన్నెవరూ అడగలేదు కూడా. ఇలాంటివి ప్రచురించేముందు మా నుంచి స్పష్టత తీసుకుంటే మంచిది’ అంటూ సిమ్రాన్ చెప్పుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu