
Single Day 1 Collections:
శ్రీ విష్ణు హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సింగిల్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రన్ చూపిస్తోంది. మే 9న విడుదలైన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్స్‌లో కూడా బజ్ కనిపిస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, సింగిల్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 4.15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది శ్రీ విష్ణు కెరీర్‌లో ఒక మంచి ఓపెనింగ్‌గా చెప్పవచ్చు. అలాగే నార్త్ అమెరికాలో ఈ సినిమా దాదాపు $200K వసూలు చేయడం విశేషం. బుక్ మై షోలో 24 గంటలలోపే 50 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి అంటే సినిమా మీద ఉన్న క్రేజ్ అర్థమవుతోంది.
వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగుండటంతో ఈ మూవీ ఆదివారం నాటికి రూ. 10 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంది. కంటెంట్ బాగుండటం, టార్గెట్ యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడం వల్లే ఈ హైప్ వచ్చిందని టాక్.
ఈ సినిమాలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటించారు. ఇద్దరూ స్క్రీన్ పై ఫ్రెష్‌గా కనిపించి యూత్‌కు కనెక్ట్ అయ్యారు. దర్శకత్వం కార్తిక్ రాజు అందించగా, విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరీ ఈ సినిమాని నిర్మించారు. ప్రెజంటేషన్ మాత్రం అల్లు అరవింద్ గారు అందించారు.
మొత్తానికి శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో మరో హిట్ అందుకున్నట్టే కనిపిస్తోంది. డే వైజ్ కలెక్షన్ రిపోర్ట్స్ కోసం మా వెంట ఉండండి!
ALSO READ: Mahabharata సినిమాలో కృష్ణుడి పాత్రలో Aamir Khan ఫిక్స్ అయినట్టేనా?