HomeTelugu Trendingరంగ రంగ వైభవంగా: సిరి సిరి సిరి మువ్వల్లోనే.. వీడియో సాంగ్‌

రంగ రంగ వైభవంగా: సిరి సిరి సిరి మువ్వల్లోనే.. వీడియో సాంగ్‌

siri muva
వైష్ణవ్ తేజ్ – కేతిక శర్మ హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా వచ్చేనెల 2వ తేదీన భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేశారు.

‘సిరి సిరి సిరి మువ్వల్లోనే ..’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరోహీరోయిన్లపై ఈ పాటను అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. జావేద్ అలీ .. శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట, సాహిత్యం పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వదిలిన ఈ సాంగ్ కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. కెరియర్ పరంగా హీరో .. హీరోయిన్ ఇద్దరికీ కూడా ఇది మూడో సినిమానే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu