HomeTelugu Big Storiesభారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన 'సీతారామం' బ్యూటీ

భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన ‘సీతారామం’ బ్యూటీ

Sita ramam Heroine mrunal t

మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, మరాఠి భామ మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన తాజా చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం అందుకుంది. రష్మిక మందన్నా కీ రోల్‌ పోషించిన ఈ మూవీ ఇప్పటికీ సందడి చేస్తోంది. ఇండియన్‌ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇందులో సీతామహాలక్ష్మిగా మృణాల్‌ పాత్ర బాగా ఆకట్టుకుంది. తన నటనకు, అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాతో ఆమెకు తెలుగులో మంచి డిమాండ్‌ పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమెకు ఇక్కడ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయట. వైజయంతి బ్యానర్లో సీతారామం చేసిన ఆమె ఇదే బ్యానర్లో మరో సినిమాకు కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. వైజయంతి బ్యానర్లో స్వప్న సినిమా పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ఇందులో ఇప్పటికే మృణాల్‌ను ఫిక్స్‌ చేశారని, ఆమె ఈ ప్రాజెక్ట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందట. ఇక తెలుగులో ఆమెకు డిమాండ్‌ పెరగడంతో మృణాల్‌ భారీగా రెమ్యునరేషన్‌ పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద ప్రొడక్షన్‌ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండు సినిమాలు చేస్తుండటంతో ఆమెను వరుసగా దర్శక-నిర్మాతలు సంప్రదిస్తున్నారట.

దీంతో మృణాల్‌ కోటీ రూపాయల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోందని సమాచారం. దీంతో తొలి సినిమా అనంతరమే ఈ రెంజ్‌లో డిమాండ్‌ చేయడం ఏంటని దర్శక-నిర్మాతలు అవాక్కవుతున్నారట. కాగా మృణాల్‌ తొలుత టీవీ సీరియల్స్‌ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, హిందీలో 3, 4 పెద్ద సినిమాలతో పాటు రెండు డిజిటల్‌లో ఓ రెండు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!