
ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా అమెరికా వెళ్ళలేదు. అయినా, ఎన్టీఆర్ సందడి మామూలుగా లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఎక్కడికి వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ పేరుకు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. హాలీవుడ్ జర్నలిస్టుల నుంచి సెలెబ్రిటీల వరకు జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఇచ్చే ఇంటర్వ్యూ ల్లో ప్రధానంగా తారక్ పేరు రాకుండా ఆ ముచ్చట్లు పూర్తి కావడం లేదు.
ఒకపక్క చరణ్ తో ఫోటోలు దిగడం, ముచ్చటించడం కనిపిస్తోన్నా.. చరణ్ దగ్గర కూడా అభిమానులు ఎన్టీఆర్ గురించే మాట్లాడుతున్నారు. ఐదు రోజుల్లో చరణ్ ఎన్నో ఈవెంట్స్ లో పాల్గొన్నాడు.. చరణ్ వెళ్లిన ప్రతి ఈవెంట్ లో ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవడం వెరీ కామన్ అయిపోయింది. లోకల్ మీడియాలో మాత్రం అమెరికాలో అదరగొడుతున్న చరణ్ అంటూ భజన మొదలైంది. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన మీడియా మిత్రులకు ఫోన్ చేసి మరీ.. చరణ్ ను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. కానీ.. చరణ్ క్రేజ్ కంటే కూడా.. యూఎస్ లో ఎన్టీఆర్ క్రేజ్ భారీగా ఉంది.
కానీ, లోకల్ గా మాత్రం చరణ్ పేరునే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. చరణ్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు అని, ఇది గొప్ప విశేషం అని ఉదరగొడుతున్నారు. ఆ తర్వాత ‘ఏబీసీ న్యూస్’కి చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు అంటూ ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నారు. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో రామ్ చరణ్ సందడి అద్భుతం అన్నట్టు ఓ రేంజ్ లో భజన కార్యక్రమాలు సాగుతున్నాయి.
మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు కేవలం చరణ్ వల్లే అన్నట్టు ఉన్నాయి వీరి ప్రమోషన్స్. పైగా అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారని.. అసలు హెచ్‌సీఏ అవార్డుల్లో ప్రజెంటర్‌గా ‘బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ను రామ్ చరణ్ అనౌన్స్ చేయడం ఆస్కార్ రేంజ్ ఘనత అన్నట్టు ఉంది వీరి వాలకం. పైగా ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారట. సొమ్ము ఒకడిది సోకు మరొకరిది అంటే ఇదే. జూనియర్ ఎన్టీఆర్ కి దక్కాల్సిన పేరును మెగా మాఫియా పట్టుకెళ్ళి చరణ్ ఎమౌంట్ లో వేశారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













