HomeTelugu Trendingసోనూసూద్‌ ఆక్సిజన్‌ ప్లాంట్స్ .. మొదట ఏపీలోనే

సోనూసూద్‌ ఆక్సిజన్‌ ప్లాంట్స్ .. మొదట ఏపీలోనే

Sonu sood sets two oxygen p

కరోనా పై పోరాటంలో సోనూసూద్ నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఈ కష్టసమయంలో ఎక్కువ మందికి సహాయం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ మరియు ఫ్రాన్స్ నుంచి ఆక్సిజన్ ప్లాంట్లను తెప్పించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రులలో ఏర్పాటు చేయనున్నారు. అయితే మొదటి రెండు ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మరియు నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రణాళికను సిద్ధం చేశారు. సోనూసూద్ మరియు అతని బృందం ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే పనిలో ఉంది, తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ మరియు ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా వారు ఇప్పటికే పొందారు. ఈ ప్లాంట్ కర్నూలు, నెల్లూరు మరియు పొరుగు గ్రామాలలో ఉన్న వేలాది మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించనుంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి ఐ.ఎ.ఎస్.. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. “సోనూసూద్ మానవత్వ ఆలోచనలకు మేము నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్ రోగులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది..” అన్నారు. కర్నూలు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు జిల్లా ఆస్పత్రుల్లో జూన్ నెలలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నానని ఆనందంగా ప్రకటిస్తున్నాను. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లోనూ మరిన్ని ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం. గ్రామీణ భారతాన్ని ఆదుకోవడానికి ఇదే సరైన సమయం’’ అని సోనూసూద్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ తరువాత.. జూన్, జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాల నిరుపేద ఆసుపత్రులను గుర్తించాము..” అని తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!