HomeTelugu Trendingస్టేజ్ పై శ్రీలీల విశ్వరూపం.. నెటిజన్ల ప్రశంసలు

స్టేజ్ పై శ్రీలీల విశ్వరూపం.. నెటిజన్ల ప్రశంసలు

Sreeleela Classical Dance P
టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ శ్రీలీల క్రేజీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. ఇక ఆమె డ్యాన్స్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. తాజాగా హైదరాబాద్‌ చిన్నజీయర్ ఆశ్రమంలో నిర్వహించిన సమత కుంభ్-2024 కార్యక్రమంలో శ్రీలీల ప్రదర్శించిన నృత్యరూపకం హైలైట్ గా నిలిచింది.

ఆ శ్రీరంగనాథుని కొంగున ముడేసుకున్న తిరుప్పావై ప్రవచనకర్త గోదాదేవిగా శ్రీలీల నాట్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఇప్పటి హీరోయిన్లలో శాస్త్రీయ నృత్యంలో ఈ స్థాయి పరిపూర్ణత సాధించినవారు తక్కువ అనే చెప్పాలి. శ్రీలీల అంత అద్భుతంగా నాట్యం చేసిందంటే అతిశయోక్తి కాదు.

“గోదను నేను గోదను… రంగని తగు దానను” అంటూ తన అందమైన కళ్లతో ఒలికించిన హావభావాలు, ప్రదర్శించిన హస్త ముద్రలు, లయబద్ధమైన పాదాల కదలికలు… చూడ్డానికి రెండు కన్నులు చాలవనిపించేలా శ్రీలీల నాట్యం చేసింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాల్లో శ్రీలీలను మోడ్రన్ అమ్మాయిగా చూసిన వారికి ఈ ‘శాస్త్రీయ’ కోణం నెటిజన్లు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై శ్రీలీల స్పందించింది. తాను చిన్నప్పుడే శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొందానని వెల్లడించింది. గోదాదేవి ఒక మహిళా రత్నం అని, అలాంటి స్త్రీమూర్తి గాథ ఎంతో రమ్యంగా ఉంటుందని అంది.

ఈ ప్రదర్శన ఇవ్వడానికి మంజుభార్గవి ఎంతో ప్రోత్సహించారని, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ స్టేజ్ పై నాట్యం చేశానని, ఈ ప్రదర్శన తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu