పవన్ పార్టీగుర్తు.. ‘గ్లాసు’ పై శ్రీరెడ్డి సెటైర్లు

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో జనసైనికులు ఓ రేంజ్ లో ప్రచారం షురూ చేశారు. పవన్ పై, అతడు స్థాపించిన పార్టీపై నిత్యం ఏదో ఒక సెటైర్ వేసే శ్రీరెడ్డి కూడా ఈ పార్టీ సింబల్ పై రియాక్ట్ అయింది. గాజు గ్లాస్ ను బీరు గ్లాస్ తో పోల్చింది.

‘అరె.. జనసేన పార్టీ గుర్తు గలాసు అంటగా.. అది బీరు గ్లాసా? వైన్ గ్లాసా? స్కాచ్ గ్లాసా? పనిలోపనిగా నాగబాబు గారికి కూడా ఓ గ్లాస్ ఇవ్వండర్రా. అసలే రీసెంట్ గా కొత్త డగొంతు వచ్చిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు.”

ఇలా జనసేన పార్టీ గుర్తుపై తనదైన శైలిలో స్పందించింది శ్రీరెడ్డి. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రతి పనిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి, చివరికి ఆ పార్టీ గుర్తును కూడా వదల్లేదు. ఎప్పటికైనా పవన్ బాగోతాన్ని బయటపెడతానంటున్న ఈ ‘నటి’.. ప్రస్తుతం చెన్నైలో మకాం వేసింది. ఓ తమిళ సినిమా చేస్తోంది.

శ్రీరెడ్డి పోస్ట్ పై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అయినా శ్రీరెడ్డి మాత్రం తగ్గడంలేదు. ప్రస్తుతానికి టాలీవుడ్ ప్రముఖులందర్నీ పక్కనపెట్టిన శ్రీరెడ్డి, కేవలం పవన్ కల్యాణ్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ తరచుగా పోస్టులు పెడుతోంది. రీసెంట్ గా పవన్ చేపట్టిన అమెరికా పర్యటనపై కూడా శ్రీరెడ్డి కొన్ని పోస్టులు పెట్టింది.