
SSMB29 Update:
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ SSMB29 కి సంబంధించిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన కాశీ సెట్‌లో, అలాగే ఒడిషాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో జరుగుతోంది.
ఈ సినిమాలో మ్యూజిక్ అందిస్తున్నది ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి గారు. ఇక బడ్జెట్ గురించి చెప్తే.. దాదాపు రూ.1000 కోట్ల భారీ అంచనాలు ఉన్నాయి. చాలా మంది ఫ్యాన్స్ దీన్ని ఇండియన్ ఇండియానా జోన్స్ అంటున్నారు.
అయితే అసలైన హైలైట్ ఏమిటంటే… ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ఈ సినిమాకు నో చెప్పడం! రాజమౌళి గారు మొదట మహేశ్ బాబు తండ్రి పాత్రకు నానా పాటేకర్‌ని ఎంపిక చేశారు. 15 రోజుల కాల్ షీటుకే రూ.20 కోట్లు ఆఫర్ చేశారు – అంటే రోజుకి రూ.1.3 కోట్లు!
రాజమౌళి స్వయంగా పుణె దగ్గర ఉన్న నానా పాటేకర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి కథ చెప్పారట. కథ వినగానే నానా గారికి బాగానే నచ్చిందట కానీ పాత్ర చిన్నదిగా అనిపించి, నచ్చలేదట. డబ్బు కన్నా పాత్రకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ బాగా మర్యాదగా తిరస్కరించారు.
ఇక ఇప్పుడు ఆ పాత్రకి సరిపోయే మళ్లీ ఓ బలమైన యాక్టర్ కోసం వెతుకులాట మొదలైంది. ఎవరైతే పాత్రకు ఎమోషనల్ వెయిట్ తీసుకుని నటించగలరో వారినే తీసుకుంటారట.