పవన్ టీం ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతోంది!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలానే ఈ నెల 19న సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు అని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. పవన్ సినిమాలో వెంకటేష్ కెమియో రోల్ ఉందని అందరు అంటున్నారు.

కాని చిత్రయూనిట్ మాత్రం ఈ విషయంపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే వెంకటేష్ అజ్ఞాతవాసిలో ఉన్నాడన్నది సీక్రెట్ గా ఉంచుతున్నారట. సినిమా రిలీజ్ టైంలోనే అది సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో.. తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!