HomeTelugu TrendingKubera: పదిగంటల పాటు డంప్ యార్డ్‌లో ధనుష్.. ఎందుకంటే!

Kubera: పదిగంటల పాటు డంప్ యార్డ్‌లో ధనుష్.. ఎందుకంటే!

Star hero Dhanush proves hi Kubera,Dhanush,sekhar kammula,nagarjuna

Kubera: తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ధనుష్‌ ఎటువంటి పాత్రల్లోనైనా ఇమిడిపోగలడు. లవ్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా జోనర్ అయినా తన మార్క్ చూపిస్తారు ధనుష్. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా సినిమాలు ఓకే చేస్తున్నాడు ధనుష్.

తెలుగులో గతంలో సర్ సినిమాతో హిట్ కొట్టి ఇప్పుడు కుబేర సినిమా చేస్తున్నాడు. ఆనంద్‌, గోదావరి, హ్యాపీడేస్‌, ఫిదా, లవ్‌స్టోరీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌లు అందుకున్న శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. టాలీవుడ్‌ హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ధనుష్, నాగార్జున ఫస్ట్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా నుండి రిలీజయిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ధనుష్ బిచ్చగాడిలా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే కుబేర సినిమా చాలా వరకు ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం కుబేర సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ముంబైలో ఓ డంప్ యార్డ్ లో రోజంతా షూటింగ్ చేసారంట.

మూవీ యూనిట్ మాస్క్‌లు, గ్లౌజ్ లు ఇలా జాగ్రత్తలు తీసుకొని షూట్ చేసినా ధనుష్ మాత్రం క్యారెక్టర్ కోసం రియల్‌గా ఎలాంటి సేఫ్టీ లేకుండా దాదాపు 10 గంటల పాటు ఆ డంప్ యార్డ్ లో షూటింగ్ లో పాల్గొన్నాడు అని తెలుస్తుంది. రియల్ ఎమోషన్స్ రావడానికి బ్రేక్ లో కూడా ఎలాంటి మాస్క్ లేకుండా అలాగే ఉండి డంప్ యార్డ్ లో తన క్యారెక్టర్ బాగా రావడానికి కష్టపడ్డారట ధనుష్.

ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ధనుష్ కి సినిమాపై ఉన్న నిబద్దత మరోసారి ప్రూవ్ అయింది అంటూ అభిమానులు, నెటిజన్లు ధనుష్ ని అభినందిస్తున్నారు. ఈ సినిమాలో ధనుష్ డీ గ్లామర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమా కోసం డంప్ యార్డ్ లో స్టార్ హీరో ఈ రేంజ్ లో షూట్ చేస్తున్నాడంటే మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి అని ఆసక్తి పెరిగింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!