స్టార్ హీరోయిన్ తో నితిన్..?

దాదాపు పది సంవత్సరాల తరువాత వరుస హిట్స్ ను అందుకుంటున్న హీరో నితిన్. ఇటీవల
త్రివిక్రమ్ తో చేసిన ‘అ ఆ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ
ఇమేజ్ ను మరింత పెంచే విధంగా తన తదుపరి సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో
హను రాఘవ పూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా
ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్
కనిపించనుందనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రబృందంతో శృతి ఓ కాంట్రాక్ట్ లో
సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా చేయడంపై ఆమె సానూకూలంగా స్పందించినట్లు
సమాచారం. ఇక ఆమె ఈ సినిమాకు డేట్స్ కేటాయించడం ఒక్కటే తరువాయి. వెంటనే షూటింగ్
ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. శృతి హాసన్ నటిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే
అవకాశాలు ఉన్నాయి.