త్వరలో మహేష్, రాజమౌళి సినిమా?

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే చూడాలనేది అయన అభిమానుల కోరిక. చాన్నాళ్ల నుండి వీరిద్దరి కలయిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి, మహేష్ కూడ తప్పకుండా సినిమా చేస్తామని గతంలో అన్నారు.

ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల మేరకు వీరిద్దరూ గత కొన్నాళ్లుగా స్టోరీ లైన్ గురించి చర్చలు చేస్తున్నారని, ఒక లైన్ ను లాక్ చేశారని, రాజమౌళి ప్రస్తుతం మొదలుపెట్టిన మల్టీస్టారర్ ముగిశాక మహేష్ సినిమా చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు వాస్తవమో కాదో ఇంకా స్పష్టత రాలేదు కానీ ఒకవేళ నిజమైతే మహేష్ అభిమానులకు ఇంతకన్నా పెద్ద వార్త మరొకటి ఉండదు.