
Subham Movie Collections:
టాప్ హీరోయిన్ సమంత టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తుందనే ఉత్కంఠతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ది ఫ్యామిలీ మాన్ 2 తర్వాత వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ చేసిన సమంత, తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ త్రలలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా సుభం అనే సినిమాను నిర్మించింది.
సుభం శుక్రవారం విడుదలైంది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం నిరాశ కలిగిస్తోంది. ఓపెనింగ్ నెంబర్స్ చాలా వీక్ గా నమోదయ్యాయి. టికెట్ కౌంటర్ల వద్ద ప్రేక్షకులు పెద్దగా రావడం లేదు. దీంతో సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
ఈ సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కందరగుల డైరెక్షన్ వహించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషించారు. సమంత చిన్న పాత్రలో కనిపించినా, ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ వారాంతానికి రిలీజ్ అయిన మరో మూవీ సింగిల్ (శ్రీ విష్ణు హీరోగా) మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. ముఖ్యంగా ఈవెనింగ్, నైట్ షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి.
అలాగే చిరంజీవి క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతి లోక సుందరి రీ-రిస్లీజ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. థియేటర్లలో ఆ సినిమాకే ఎక్కువ మంది వెళ్లడంతో సుభం మరియు సింగిల్ రెండూ డామేజ్ అయ్యాయి.
అలాగే సుభం ప్రమోషన్‌లోనూ చాలా లోపాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సరైన మార్కెటింగ్ లేకపోవడంతో సినిమా అందరికీ రీచ్ కాలేదు. సమంత కెమెరా ముందుకు రాకపోవడం కూడా మైనస్ పాయింట్ అయింది.
మొత్తానికి సుభం ఒక మంచి ప్రయత్నంగా ఉన్నా, మార్కెటింగ్ లోపాలు, పెద్ద సినిమాల పోటీ కారణంగా బాక్స్ ఆఫీస్ లో ఫెయిల్ అయ్యింది.