దయనీయ పరిస్థితుల్లో సినిమా నటి!

అప్పటివరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి సుభాషిణికి ‘అల్లరి’ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఆమె నటిగా బిజీ అయ్యారు. అయితే కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. దానికి కారణం ఆమె అనారోగ్యమే అని తెలుస్తోంది. కొంత కాలంగా ఆమె ప్రాణాంతక 
వ్యాధి క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన దయనీయ పరిస్థితి గురించి వెల్లడించారు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నానని, మొదట దానికి కారణం క్యాన్సర్ అని తెలియక మందుతులతో సరిపెట్టుకున్నాను. కానీ ఎంఎంజె హాస్పిటల్ లో పరీక్షలు చేయించిన తరువాత క్యాన్సర్ అని తెలిసిందన్నారు. ఆపరేషన్ కోసం డబ్బు ఖర్చవుతుందని చెప్పారు.. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. కొందరు స్నేహితులు ఆపరేషన్ కోసం ఐదు లక్షణ వరకు అడ్జెస్ట్ చేశారని అలానే ఎంఎంజె హాస్పిటల్ వారు కూడా ఎంతో సహాయం చేశారని వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. 
పూర్తిగా కోలుకున్న తరువాత సినిమాల్లో నటించాలనుందని తన కోరికను వెల్లడించారు. కెరీర్ సాఫీగా సాగిపోతున్నప్పుడు సంపాదించిన డబ్బు మొత్తాన్ని తన సోదరితో కలిసి ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టానని, అయితే నష్టాలు రావడంతో ఆ డబ్బు మొత్తం పోయిందని వెల్లడించారు. ఇరవై ఏళ్ల క్రితం భర్త చనిపోయిన తరువాత హైదరాబాద్ లో ఓ వ్యక్తి తోడుగా ఉన్నాడని, అతడు కూడా మోసం చేసి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూతురు దగ్గర ఉంటూ జీవనం సాగిస్తున్న ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు.