రష్యా హిస్టారికల్‌ పుస్తకం పై ట్వీట్‌ చేసిన సోనాలి

ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కీమో థెరపీ నిమిత్తం గుండు కూడా చేయించుకున్నారు. అయితే, ఏ క్షణంలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ, సామాజిక మాధ్యమాల వేదికగా అనేక విషయాలను పంచుకుంటున్నారు. అంతేకాదు, పలువురు క్యాన్సర్‌ రోగుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ఫొటోను పంచుకున్నారు.

చేతిలో పుస్తకం పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ‘ఇవాళ పుస్తకం చదవాల్సిన రోజు. ఇది రష్యాకు చెందిన హిస్టారికల్‌ ఫిక్షన్‌ పుస్తకం. దీని పేరు ‘ఎ జెంటిల్‌మెన్‌ ఇన్‌ మాస్కో’ అమోర్‌ టౌలెస్‌ రాశారు. చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పుస్తకం మొత్తాన్ని ఎప్పుడెప్పుడు చదువుదామా? అని ఆతృత్రతో ఉన్నా’ అని ట్వీట్‌ చేశారు.