రామ్‌, పూరి సినిమాలో బాలీవుడ్ విలన్‌..!

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాను ప్రారంభించారు. డబుల్ దిమాక్‌ అనే ట్యాగ్‌ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్‌ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాలో రామ్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుండగా విలన్‌ పాత్రలకు బాలీవుడ్ నటుడిని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో స్టైలిష్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్న సుదాన్షు పాండే ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. రజనీకాంత్, శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘2.ఓ’ లో సుధాన్షు గెస్ట్‌ రోల్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.