మలయాళం సూపర్ స్టార్ సినిమాలో రాశి పాట!

రాశిఖన్నా మంచి గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదూ.. ఆమెలో మంచి గాయని కూడా ఉంది. కవితలు కూడా చక్కగా రాస్తుంటుంది. చిన్నప్పుడు స్కూల్ లో పాటల పోటీల్లో బహుమతులు అందుకున్నే రాశి అప్పుడే సింగర్ కావాలని ఆస పడింది. కానీ హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. గతంలో జోరు సినిమాలో టైటిల్ ట్రాక్ పాడిన ఈ బ్యూటీ తాజాగా ఓ మలయాళం సినిమా కోసం తన గొంతు అందించింది.

మోహన్ లాల్, విశాల్ వంటి తారలు మలయాళంలో నటిస్తోన్న సినిమాలో రాశిఖన్నా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు ఈ సినిమా టైటిల్ సాంగ్ కూడా తనతోనే పాడించారు. దీంతో తన కోరిక నెరవేరిందని అమ్మడు తెగ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇకపై సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే గాయనిగా కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది.