HomeTelugu Trendingకార్తీ 'సుల్తాన్‌' టీజర్‌

కార్తీ ‘సుల్తాన్‌’ టీజర్‌

Sulthan Teaser
తమిళ నటుడు కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్‌’. రష్మికా మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. దీనితో పాటు రిలీజ్‌ డేట్‌ను కూడా వెల్లడించింది. ఈ టీజర్‌లో కార్తీ పశువులను మేపుతూ, ట్రాక్టర్‌ నడుపుతూ, యాక్షన్‌ సీన్లలో ఫైటింగ్‌ చేస్తూ కనిపించాడు. అలాగే రక్తమోడుతున్న ఒకరి చేయి పట్టుకుని ఏదో మాటిస్తున్నట్లు కనిపించింది. హీరోయిన్‌ రష్మిక పల్లెటూరి అమ్మాయిగా మెరిసింది. యాక్షన్‌, లవ్‌, సెంటిమెంట్‌, డ్రామా ఇలా అన్ని అంశాలను రంగరించినట్లుగా ఉన్న ఈ టీజర్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. షూటింగ్‌ పూర్తైన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి భాగ్య రాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహించాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్‌ఆర్‌ ప్రభు, యస్‌ఆర్‌ ప్రకాష్‌ నిర్మించారు. తమిళంలో రష్మికకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!