‘సైరా’ మేకింగ్‌ వీడియో చూశారా!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా మేకింగ్‌ వీడియో విడుదలైంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్క రోజు ముందుగా ఈ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. సెట్‌లో జరిగిన సంఘటనల్ని పంచుకుంది.

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. ‘ధృవ’ ఫేం సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.