షూటింగ్‌కి రెడీ అంటున్న యంగ్‌ హీరో.. న్యూలుక్‌ వైరల్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ జాగ్రత్తగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్ సినిమాల్ని మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని కూడ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. సందీప్ కిషన్ ప్రస్తుతం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమా షూటింగ్ నిలిచి పోయింది. ప్రస్తుతం షూటింగ్‌లు ప్రారంభిస్తున్న నేపధ్యంలో తన సినిమాను కూడా స్టార్ట్‌ చేయబోతున్నట్లు సందీప్ కిషన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. దానికి తోడు రెండు ఫోటోలను షేర్ చేసాడు. ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ కనుకోలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక ఫొటోలో సిక్స్ ప్యాక్ బాడీని చూపించాడు సందీప్. ఈ ఫోటోలు చూస్తుంటే ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లో సందీప్ ను కొత్తగా విభిన్నంగా చూడబోతున్నాంఅని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

CLICK HERE!! For the aha Latest Updates