HomeTelugu Trendingవిలన్‌గా సునీల్‌..

విలన్‌గా సునీల్‌..

3 28
టాలీవుడ్‌లో కమెడీయన్‌గా, హీరోగా ప్రేక్షకులను అలరించాడు సునీల్‌. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా వివరాలను చిత్రబృందం ప్రకటించింది. సుహాస్‌, సందీప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కలర్‌ ఫొటో’. ఈ చిత్రానికి సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో సునీల్‌ విలన్‌గా ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నేచురల్‌ స్టార్‌ నాని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ”కలర్‌ ఫొటో’ చిత్రాన్ని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎంతో ప్రతిభ ఉన్న వీళ్లు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం నేనెంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నాను. ఫస్ట్‌లుక్‌తోనే ఈ బృందం ఆకట్టుకుందని భావిస్తున్నాను’ అని నాని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu