
Balakrishna in Jaat:
బాక్సాఫీస్ వద్ద యాక్షన్ మాస్ హిట్ కొట్టిన సినిమా “జాట్”. సన్నీ డియోల్‌ను మరో లెవెల్‌లో చూపించిన ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. “గదర్ 2” తర్వాత మళ్లీ మాస్‌ను అలరించిన సన్నీ డియోల్‌కు “జాట్” మరో హైపెడ్ విజయం. కానీ ఈ ప్రాజెక్ట్ మొదట బాలకృష్ణ కోసం రెడీ చేశారంటే నమ్మాలిసిందే!
ఇటీవల గోపిచంద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. “క్రాక్” తర్వాత బోయపాటి సింహారెడ్డి సినిమా మొదలు కాకముందే, గోపిచంద్ మలినేని బాలకృష్ణ గారిని కలిశారు. జాట్ కథ చెప్పి ఓకే కూడా చెప్పించుకున్నారు. కానీ “అఖండ” తర్వాత బాలయ్యగారు ఫ్యాక్షన్ కథకే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుందని భావించి, జాట్ ప్లాన్ కన్‌ఫర్మ్ కాలేదు. దాంతో “వీర సింహారెడ్డి” జన్మించింది.
ఇప్పుడు బాలయ్య అభిమానులు, “జాట్” చూసిన తర్వాత, ఆయన ఆ కథలో ఉంటే ఎలా ఉండేది అని డిస్కషన్ చేస్తున్నారు. బాలయ్య మాస్ మేనరిజమ్స్‌కి ఈ కథ బాగా సూటవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ వీర సింహారెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ హిట్ అందుకుంది.
ఇక “జాట్” సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమాలో సన్నీ డియోల్‌తో పాటు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెజినా కసాండ్రా, సయ్యామీ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
అంతా బాగానే జరిగిందన్న మాట. కానీ బాలయ్య “జాట్” చేసినుంటే ఇంకో లెవెల్ మాస్ ఫీస్ట్ ఉండేదన్నది మాత్రం నిజం!













