HomeTelugu Trendingజిన్నా: సన్నీలియోన్‌ ఫస్ట్‌లుక్‌

జిన్నా: సన్నీలియోన్‌ ఫస్ట్‌లుక్‌

Sunny leone as a Renuka in
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్, స‌న్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుద‌లైన పాయ‌ల్ రాజ్‌పుత్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. కాగా తాజాగా స‌న్నీలియోన్ పోస్ట‌ర్ కూడా విడుదల చేసింది. ఈ చిత్రంలో రేణుక అనే అమ్మాయి పాత్ర‌లో స‌న్నీలియోన్ న‌టిస్తోంది‌. రోజ్ క‌ల‌ర్ మినీ స్క‌ర్ట్‌, వైట్ టాప్ లో ఉన్న స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని ప‌ల్లెవెలుగు బ‌స్సు దిగుతోంది. మోడ్ర‌న్ డ్రెస్‌లో ఇలా ఆర్‌టీసీ బ‌స్సులో నుంచి దిగుతూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలుస్తోంది స‌న్నీ.

ఈ చిత్రాన్ని హోం బ్యాన‌ర్ ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. రేణుకను మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను జిన్నా చిన్ననాటి స్నేహితురాలిని..కానీ నేన‌తని జీవితాన్ని తలకిందులు చేయనని కాదు.. ఊహించని మలుపులు, ట్విస్టుల‌తో ఈ ప్ర‌యాణం క్రేజీగా ఉండబోతోంది.. అంటూ ట్వీట్ చేసింది స‌న్నీలియోన్‌. కోన వెంక‌ట్ క‌థ‌, స్క్రీన్ ప్లే అందించ‌డంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న జిన్నాకు చోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫ‌ర్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!