సూర్య ఔట్.. విష్ణు ఇన్!

సూర్య నటించిన ‘సింగం3’ చిత్రాన్ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ జల్లికట్టు వివాదంతో ఆ సినిమా కాస్త వెనక్కి వెళ్లింది. దీంతో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘లక్కున్నోడు’ సినిమాను అదే రోజున విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. . ఈ సందర్భంగా..

చిత్ర నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. “రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ కిరణ్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డైమండ్ రత్నబాబు స్క్రీన్ ప్లే-మాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. సినిమా కూడా అదే స్థాయిలో వారిని అలరిస్తుందని నమ్మకంగా చెప్పగలను. జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా ‘లకున్నోడు’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.