సిద్ధార్థ్ సినిమా ఆగిపోయింది!

హీరో సిద్దార్థ్ చాలా కాలం తరువాత ‘గృహం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేరోజు ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నాడు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు. కానీ థియేటర్లు దొరకక సినిమా వెనక్కి వెళ్లింది. ఈ వారం ‘గరుడ వేగ’,’ఏంజెల్’,’నెక్స్ట్ నువ్వే’ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

దీంతో డబ్బింగ్ సినిమా అయిన సిద్దార్థ్ ‘గృహం’కి ఆశించిన థియేటర్లు దొరకలేదు. దీంతో తెలుగు రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తమిళ, హిందీ భాషల్లో మాత్రం సినిమా రేపే విడుదల కానుంది. తెలుగులో సినిమా ఎప్పుడు రిలీజ్
చేస్తారనే విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

ప్రచార చిత్రాల ద్వారా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!