HomeTelugu Big Storiesసూర్య కొత్త సినిమా టైటిల్‌ ప్రకటన

సూర్య కొత్త సినిమా టైటిల్‌ ప్రకటన

Surya

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సిరుత్తే శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా పది భాషల్లో విడుదల కానుంది. 2డి, 3డి ఫార్మాట్ లో అభిమానులను అలరించనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దిశా పఠానీ హీరోయిన్ నటిస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందిజ ఈ సినిమా టైటిల్ ని తాజాగా ప్రోమోతో రిలీజ్ చేశారు.దీనికి ‘కంగువ’ అనే పేరు పెట్టింది. కంగువ అంటే అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా టైటిల్ ప్రోమోకి కూడా ఎవ్వరూ ఊహించని స్థాయిలో హై అండ్ లో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఇలాంటి పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రానికి కెరియర్ లో మొదటి సారి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం.

ఈ సినిమా షూటింగ్ గోవా, చెన్నై, ఇతర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాని వంశీ, ప్రమోద్, కేఈ జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిన సీక్వెన్స్ కూడా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక మూవీలో సూర్య పోషించే వారియర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంట. ఇటువంటి ఛాలెంజింగ్‌ పాత్రలు చేయడంలో సూర్యకు నైపుణ్యం ఉంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu