HomeTelugu Trendingఆస్కార్‌ రేసులో సూర్య ఆకాశం నీ హద్దురా!

ఆస్కార్‌ రేసులో సూర్య ఆకాశం నీ హద్దురా!

Soorarai pottru in oscar
తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (సూరరై పోట్రు). సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఓటీటీ ద్వారా విడుదలై రికార్డు సృష్టించింది. అంతేకాదు! ఈ సంవత్సరం ఉత్తమ నటుడు, నటి, దర్శకురాలు/దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్‌ రేసులోనూ నిలిచింది. మంగళవారం అకాడమీ స్క్రీనింగ్‌ రూమ్‌లో దీన్ని ప్రదర్శించారు. అపర్ణా బాలమురళీ, మోహన్‌ బాబు, పరేశ్‌ రావల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత నవంబర్‌ 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఎయిర్‌ డెక్కన్‌ అధినేత కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే ‘సింప్లీ ఫ్లై’ బుక్‌ను దర్శకురాలు సుధ రెండు గంటల సినిమాగా మలిచి సక్సెస్‌ అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu